WhatsApp Aadhar Card: WhatsApp ద్వారా ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేయు విధానం – పూర్తి స్టెప్ బై స్టెప్ గైడ్ 2025

WhatsApp Group Join Now

WhatsApp ద్వారా ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఇలా..! స్టెప్ బై స్టెప్ గైడ్ | WhatsApp Aadhar Card Download Guide

ఇప్పటివరకు ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే UIDAI వెబ్‌సైట్ లేదా DigiLocker యాప్ వాడాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం మరింత సులభతరం చేస్తూ WhatsAppలోనే ఆధార్ డౌన్‌లోడ్ చేసే సౌకర్యంని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ను MyGov Helpdesk అనే అధికారిక చాట్‌బాట్ ద్వారా ఉపయోగించుకోవచ్చు.

ఆధార్ కార్డు మన దేశంలో అత్యంత కీలకమైన గుర్తింపు పత్రం. ప్రభుత్వ సేవలు, సబ్సిడీలు, బ్యాంక్ సర్వీసులు ఇలా అన్ని రంగాల్లో అవసరం అవుతుంది. అందుకే WhatsAppలో ఆధార్ డౌన్‌లోడ్ సౌకర్యం చాలా మందికి ఉపయోగకరంగా మారబోతోంది.


WhatsAppలో ఆధార్ డౌన్‌లోడ్ చేయాలంటే ఏమి చేయాలి?

  1. ముందుగా MyGov Helpdesk నంబర్ +91-9013151515ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకోండి.
  2. WhatsApp ఓపెన్ చేసి “Hi” లేదా “Namaste” అని మెసేజ్ పంపండి.
  3. చాట్‌బాట్‌లో కనిపించే DigiLocker Servicesను సెలెక్ట్ చేయండి.
  4. మీ DigiLocker అకౌంట్‌ని కన్ఫర్మ్ చేసి, 12 అంకెల ఆధార్ నంబర్ను ఇవ్వండి.
  5. రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని ఎంటర్ చేయండి.
  6. వెరిఫికేషన్ పూర్తయ్యాక, మీ డాక్యుమెంట్స్ లిస్ట్ వస్తుంది.
  7. అందులో Aadhaar Cardను సెలెక్ట్ చేస్తే, వెంటనే PDF ఫార్మాట్‌లో మీ ఆధార్ WhatsAppలో వస్తుంది.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు

  • ఒకేసారి ఒకే డాక్యుమెంట్ మాత్రమే పొందవచ్చు.
  • ఆధార్ ముందుగానే DigiLockerతో లింక్ అయి ఉండాలి. లింక్ కాకపోతే ముందు DigiLocker వెబ్‌సైట్ లేదా యాప్‌లో అప్‌డేట్ చేసుకోవాలి.
  • డౌన్‌లోడ్ అయ్యే ఆధార్ PDF రూపంలో డిజిటల్ కాపీ మాత్రమే అవుతుంది.

OTP లేకుండా ఆధార్ డౌన్‌లోడ్ చేసే మార్గం

OTP ఉపయోగించకూడదనుకునే వారు UIDAI వెబ్‌సైట్ ద్వారా ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  • పేరు, జననతేది, లింగం వంటి వివరాలను ఇచ్చి రికార్డులు చెక్ చేసుకోవాలి.
  • తరువాత Aadhaar Number, Request Number, DOB ఇవ్వాలి.
  • OTP బదులు mAadhaar యాప్ ద్వారా TOTP (Time-based OTP) జనరేట్ చేసి యాక్సెస్ పొందవచ్చు.

ఈ విధంగా WhatsApp ద్వారా ఆధార్ డౌన్‌లోడ్ ఫీచర్, ప్రజలకు మరింత సౌకర్యవంతంగా, వేగంగా వారి డాక్యుమెంట్స్ అందేలా చేయనుంది.

WhatsApp Group Join Now

Leave a Comment

WhatsApp